Header Banner

SLBC టన్నెల్‌లో ఘోర ప్రమాదం! ప్రధాని మోదీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి!

  Sat Feb 22, 2025 20:38        Others

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో ఎడమ వైపు సొరంగం 14 కిలోమీటర్‌ వద్ద టన్నెల్ పైభాగం కుంగిపోవడంతో 42 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో 13 మందికి గాయాలు కాగా, మరో 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.

 

ఇది కూడా చదవండి: మీ ఆన్‌లైన్ పనులు చిటికెలో పూర్తి చేసే టూల్! ఏఐ ఏజెంట్ ఆపరేటర్ విశేషాలు ఇవే!

 

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫోన్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోపల చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎం వివరించారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

ఇటీవల ఐదేళ్ల విరామం తరువాత ఈ ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల క్రితమే ఈ ప్రాంతంలో టన్నెల్ బోరింగ్ పనులు మొదలయ్యాయి. అయితే, ఉదయం 8.20 గంటల సమయంలో బోర్ మిషన్ బురదలో చిక్కుకుపోవడంతో సుమారు మూడు మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్లు కుంగిపోయాయి. టన్నెల్‌లో రింగులు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాలుగు అడుగుల మేర నీరు చేరడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్మీ సాయాన్ని కోరడంతో వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఘటన స్థలానికి పంపించారు. ప్రస్తుతం లోపల ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు



పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #Hyderabad #slbc #tunnel #tunnelaccident